Roja,Chiranjeevi: చిరంజీవి ఇంటికెళ్ళిన రోజా.. వైరల్ అవుతున్న వీడియో!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా ఇప్పుడు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అయిన సంగతి తెలిసిందే.మంత్రి అయ్యాక ప్రస్తుతం ఆవిడ హైదరాబాదులో బిజిబిజీగా గడుపుతున్నారు. తొలుత ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆమె భేటీ అవ్వడం జరిగింది. అటు తర్వాత కుటుంబ సమేతంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ… రోజా మరియు ఆమె భర్త సెల్వమణి, పిల్లలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

ఇదే రోజు ఆచార్య మూవీ రిలీజ్ డేట్ కూడా కావడంతో రోజా చిరుకి శుభాకాంక్షలు తెలియజేశారు రోజా. మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదే క్రమంలో ఆయన సందర్భంగా రోజాకు శాలువా కప్పి సత్కరించారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి, రోజా ల మధ్య గతంలో రాజకీయాల పరంగా మాట మాట వచ్చింది కానీ వీరు మంచి సన్నిహితులు. ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లుగా చేశారు.

చిరు ఇంట్లో ఏ ఈవెంట్ జరిగినా.. రోజా హాజరవుతారు, అలాగే రోజా ఇంట్లో ఏ వేడుకలు జరిగినా చిరు హాజరవుతూ ఉంటారు. ప్రొఫెషనల్ గా దారులు వేరైనా వ్యక్తిగతంగా వీరి రెండు ఫ్యామిలీలకు మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే ‘చిరంజీవిని హీరోగా ఆమె చాలా అభిమానిస్తానని, ఆయనతో నటించడం గొప్ప అనుభూతి … ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాను.. చిరంజీవి పక్కన అవకాశం వస్తే నటించడానికి రెడీగా ఉన్నానని.

చిరంజీవి సెట్స్‌లో తనను బాగా చూసుకునేవారని … ‘ఆలయ శిఖరం’ సినిమా సెట్స్‌కు వెళ్లి చిరంజీవితో తన చేతి పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్నానని’ రోజా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus