Roja: వాళ్లకు భారీ షాక్ ఇచ్చిన ఆర్కే రోజా.. అలా మాత్రం చేయొద్దంటూ?

మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా (Roja) 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం రోజా యాక్టివ్ గా ఉంటూ వేర్వేరు అంశాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. రోజాకు అధికారికంగా ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేకపోయినా గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని ఛానెళ్లను నిర్వహిస్తూ రోజా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా చేస్తున్నారు.

Roja

ఆ యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా రోజా గురించి తరచూ ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆమె ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ యూట్యూబ్ ఛానెళ్లను డిలీట్ చేయకపోతే చర్యలు తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, థ్రెడ్స్, ట్విట్టర్ అకౌంట్లను మాత్రమే తాను వినియోగిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నా ఫ్యాన్స్ బ్లూ టిక్ ఉన్న అకౌంట్స్ ను మాత్రమే ఫాలో కావాలని ఆమె సూచించారు.

యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నాపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. రోజా వార్నింగ్ నేపథ్యంలో ఆ యూట్యూబ్ ఛానెళ్ల విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఆ ఛానెళ్ల నిర్వాహకుల తీరు మారకపోతే రోజా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. రోజా కెరీర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

రోజా పార్టీ మారతారని తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో కూడా నిజం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి. 2029 ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని రోజా నమ్ముతున్నారు.

అరుపులకు థియేటర్ కూలిపోతుందని భయపడ్డా.. పరుచూరి కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags