మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సినీ కెరీర్ లో సాధించిన విజయాలు అన్నీఇన్నీ కావు. చిరంజీవి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) చిరంజీవి సాధించిన గిన్నిస్ రికార్డ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల స్టెప్స్ వేయడం అనితర సాధ్యమని పరుచూరి తెలిపారు. ఖైదీ సినిమా రిలీజైన సమయంలో అందరూ ఒక మాట మాట్లాడుకునేవారని ఆయన పేర్కొన్నారు.
ఆ సినిమా హిట్ కావడానికి కారణమేంటనే చర్చ ఫ్యాన్స్ మధ్య జరిగేదని ఆయన తెలిపారు. రైటర్లు ఎంత గొప్పగా రాసినా కొన్నిసార్లు సినిమా హిట్ కాదని పరుచూరి పేర్కొన్నారు. రామాయణంను సినిమాగా తెరకెక్కించి కొంతమంది సక్సెస్ సాధిస్తుంటే మరి కొందరు ఫెయిల్ అవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ తో కూడా ఆకట్టుకుంటారని పరుచూరి (Paruchuri Gopala Krishna) తెలిపారు. 24,000 డ్యాన్స్ స్టెప్స్ అంటే సాధారణ విషయం కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ రికార్డు ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసిన రికార్డ్ అని ఆయన కామెంట్లు చేశారు. చిరంజీవి గారికి సురేఖ గారు దిష్టి తీయాలని పరుచూరి వెల్లడించారు. ఇంద్రలోని (Indra) వీణ స్టెప్ ను థియేటర్ లో చూసే సమయంలో ఫ్యాన్స్ అరుపులతో థియేటర్ కూలిపోతుందేమో అని అనిపించిన్డని పరుచూరి కామెంట్స్ చేశారు. చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ అని సినిమా సినిమాకు చిరంజీవి ఎదుగుతూ వచ్చారని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి గారు ఇలాంటి అవార్డ్స్ ను ఎన్నో అందుకోవాలని పరుచూరి అభిప్రాయపడ్డారు. చిరంజీవి విశ్వంభర (Vishwambhara) మూవీ ఓటీటీ స్లాట్ వల్ల సంక్రాంతికి రిలీజ్ కాదని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చిరు కెరీర్ లో విశ్వంభర స్పెషల్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.