ఒక్క సెట్ కోసం 20 కోట్లు!!

ఇదేదో హాలీవుడ్ న్యూస్ అనుకోకండి, మన ఇండియాలోనే మన భారతీయ సినిమా కోసమే ఒక సెట్ కోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంత దమ్ము ఎవరికీ ఉంది అనుకుంటున్నారా? ఇండియన్ సినిమాను ఒక స్థాయికి, ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ శంకర్ కాకుండా మరే డైరెక్టర్ ఇంత సాహసానికి పూనుకోడనే సంగతి రజనీకాంత్ హీరో గా ఆయన నిర్మించిన ‘రోబో’ సినిమాతో నే ప్రపంచానికి తెలిసిపోయింది. గతం లో ‘రోబో’ సినిమాను కూడా ఎక్కడ ఖర్చు విషయం లో రాజీ పడకుండా అధ్బుతంగా తీసిన సంగంతి మనదరికి విదితమే.తన తాజా చిత్రం ‘2.0’ కోసం దేనికి వెనుకాడకుండా 20 కోట్లతో ఒక ఫైట్ సెట్ ని ఏర్పాటు చేసి ఆ ఫైట్ చిత్రీకరించనున్నారని తెలిసింది.
     ‘ట్రాన్స్ ఫార్మర్స్’, ‘పెర్ల్  హార్బర్’, ‘డై హార్డ్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలకు యాక్షన్ కంపోజ్ చేసిన కెన్నీ బేట్స్ ‘2.0’కి యాక్షన్ ఎపిసోడ్స్ ని కంపోజ్ చేస్తున్నాడని తెలిపారు. మార్చి నుంచి ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందు కోసం పొన్నామల్లీ ప్లేస్ లో ఓ భారీ సెట్ ని డిజైన్ చేసారు.ఆసేట్ కి అయిన ఖర్చు అక్షరాల 20 కోట్లు.  ఈ ఫైట్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే మొదటగా డూప్స్ తో ఒకసారి షూట్ చేసి తర్వాత రియల్ గా షూట్ చేయనున్నారు.
అలాగే జురాసిక్ పార్క్, అవెంజర్స్, ఐరన్ మాన్ సినిమాలకు పనిచేసిన లెగసి ఎఫెక్ట్స్ కంపెనీ వారు ఈ సినిమాకి విజువల్స్ ఎఫెక్ట్స్ చేస్తున్నారు. అమీ జాక్సన్ ఓ హీరోయిన్ గా ఎంపికైన ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. సుమారు 350 కోట్ల పై బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్ వారు సినిమాని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus