రోజాను కావాలనే అలా అడిగారట..!

  • April 5, 2016 / 05:50 AM IST

ప్రముఖ టీవీ ఛానెల్ కు చెందిన ఓ రిపోర్టర్ రోజాను ‘మీరు బ్లూ ఫిలిం లో నటించారా..?’ అనే ప్రశ్న వేశారు. ప్రతి దానికి ఘాటుగా స్పందించే రోజా సైతం ఈ ప్రశ్న అడిగిన వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఆ ఛానెల్ మాత్రం ఈ ప్రోమోను విడిచిపెట్టకుండా.. తమ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలనే చూశారు. అయితే రోజాను ఇలాంటి ప్రశ్న అడగడానికి కారణం తెలుగు దేశం పార్టీ నాయకులే అని మరొక వార్త వినిపిస్తోంది.
గతంలో తెలుగుదేశం వాళ్ళు నన్నేం చేస్తారు.. రేప్ చేస్తారా..? అంటూ వ్యాఖ్యలు చేసింది రోజా. దీంతో తనను ఎదుర్కోవడానికి తన రూట్ నే ఎన్నుకున్నారు టిడిపి నాయకులు. నిజానికి రోజా బ్లూ ఫిల్మ్స్ లో నటించిందన్న వార్తల్లో నిజం లేదు. మలయాళంలో రోజా మాదిరి ఉండే ఒక అమ్మాయి నీలి చిత్రాలలో నటించిన వీడియో నెట్ లో హల్ చల్ చేసింది. కొందరు నెటిజన్లు ఇందులో నటించింది.. రోజానే అని ప్రచారం చేశారు. ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణం. రోజాను ఈ ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ ఇంటర్నెట్ లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus