ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు రోజా(Roja). సినిమాల్లో అవకాశాలు తగ్గడానికి కేవలం తన పొలిటికల్ బిజీ షెడ్యూలే కారణమని, అందుకే బుల్లితెర షోలకు మాత్రమే టైమ్ ఇస్తున్నానని ఆమె చెబుతుంటారు.
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా.. తన సినీ, రాజకీయ ప్రయాణంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘ముఠామేస్త్రి’ షూటింగ్ రోజుల గురించి రోజా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ సినిమా ఫస్ట్ షాట్ డ్యాన్స్‌తోనే మొదలైందని, స్టార్టింగ్‌లో భయపడినా చిరు సపోర్ట్‌తో స్టెప్పులు వేశానని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ఊటీ సెట్స్‌లో ఉన్న రామ్ చరణ్ గురించి చెబుతూ.. ‘చరణ్ అప్పట్లో చాలా అల్లరి పిల్లాడు. నేను అతన్ని ఎత్తుకుని ఆడిస్తుండేదాన్ని. కానీ స్కూల్‌కి వెళ్లడం స్టార్ట్ చేశాక పూర్తిగా సైలెంట్ అయిపోయాడు.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చరణ్ యాక్టింగ్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. అతని డ్యాన్స్‌లో చిరంజీవి గారి షేడ్స్ స్పష్టంగా కనిపిస్తాయి’ అని రోజా మురిసిపోయారు.ఇక మిగతా టాలీవుడ్ స్టార్స్ గురించి కూడా రోజా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరెట్ యాక్టర్ అని, ఆయనకు తల్లిగా మాత్రం అస్సలు నటించనని నవ్వుతూ చెప్పారు. కావాలంటే వదిన, అక్క పాత్రలు చేయడానికి రెడీ అన్నారు.
ఇక డార్లింగ్ ప్రభాస్ క్యారెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్‌లోని గ్రేస్, అలాగే ‘గంగోత్రి’ నుండి బన్నీ స్టైల్ ఐకాన్‌గా మారిన తీరును ఆమె ఎంతగానో ప్రశంసించారు.బాలకృష్ణ చాలా సరదాగా ఉంటారని… ‘భైరవద్వీపం’లో తన క్వీన్ గెటప్ చూసి ఆయన మెచ్చుకున్నారని రోజా అన్నారు.
ఇక తాను మంత్రి అయిన తర్వాత విక్టరీ వెంకటేష్ కలిసి.. ‘నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’ అని అభినందించారని తెలిపారు.కింగ్ నాగార్జున విషయానికొస్తే.. ఆయన ఎంతో కూల్‌గా ఉంటారని, హీరోయిన్స్‌ను చాలా గౌరవంగా చూస్తారని రోజా ప్రశంసించారు.