Roja, Balakrishna: బాలయ్య షోకు గెస్ట్ గా రోజా.. దబిడి దిబిడే!

  • November 20, 2021 / 11:41 AM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ పేరుతో ఆహా ఓటీటీలో టాక్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, నాని ఈ షోకు గెస్టులుగా హాజరు కాగా కొన్నిరోజుల క్రితం బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో ఈ షోకు బ్రేకులు పడ్డాయి. ఆహా నిర్వాహకులు ట్విట్టర్ ద్వారా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ షో తర్వాత ఎపిసోడ్ వాయిదా పడిందని కీలక ప్రకటన చేశారు. మూడో ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేష్ లేదా విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

బాలయ్యకు ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే రాబోయే వారాల్లో ఈ షోకు రోజా గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ సెట్ నుంచి రోజా స్టార్ హీరో బాలకృష్ణకు కాల్ చేయగా బాలయ్య జబర్దస్త్ షోకు జడ్జిగా వస్తానని అన్నారు. అయితే రోజా అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది. బాలయ్య, రోజా ప్రస్తుతం రాజకీయంగా వేర్వేరు పార్టీలలో ఉన్నారు.

బాలయ్య, రోజా ఇప్పటికే పలు సినిమాల్లో కలిసి నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. బాలయ్య హోస్టింగ్ ను రోజా మెచ్చుకున్నారని బాలయ్య షోకు రావడానికి రోజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఒకే షోలో కనిపిస్తే దబిడి దిబిడే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే బాలయ్య రోజా ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని సమాచారం. అయితే బాలయ్య షోలో రోజా పాల్గొననున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus