Romantic Collections: వీక్ డేస్ లో స్లీపేసిన ‘రొమాంటిక్’ కలెక్షన్లు..!

  • November 3, 2021 / 09:45 PM IST

ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ‘పూరి కనెక్ట్స్’, ‘పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్’ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 29న విడుదల అయిన ఈచిత్రానికి యవరేజ్ రిపోర్ట్స్ మాత్రమే వచ్చాయి. కానీ ముందు నుండీ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లు భారీగా నిర్వహించడం.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేయించడం వంటివి ఈ సినిమాకి డీసెంట్ ఓపెనింగ్స్ నమోదయ్యేలా చేసాయి. కానీ వీక్ డేస్ లో ఈ చిత్రం తడబడుతుంది.

ఓసారి 5డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.24 cr
సీడెడ్ 0.68 cr
ఉత్తరాంధ్ర 0.44 cr
గుంటూరు 0.28 cr
ఈస్ట్ 0.27 cr
వెస్ట్ 0.20 cr
కృష్ణా 0.24 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.52 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 Cr
ఓవర్సీస్ 0.08 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.70 cr

‘రొమాంటిక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.4.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.70 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టాలి.చూస్తుంటే అది అసాధ్యమనే చెప్పాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus