R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ‘గరివిడి లక్ష్మి’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌పై ఉన్న విమర్శలే. ఒక దశలో ఆయనే సినిమాలో విలన్‌గా చూపించారు అని ఆయనే అనేశారు. ఆ సినిమా విడుదల తర్వాత ఆర్పీ పట్నాయక్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

R. P. Patnaik

అందులో సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అలాగే గరివిడి లక్ష్మి దగ్గర ఆర్పీ పట్నాయక్ ట్యూన్స్ కొట్టేసి, డబ్బులు ఇవ్వకుండా సినిమాలలో పాటలు పాడిస్తానని హామీ మోసం చేశాడన్న కామెంట్లపై కూడా ఆయన స్పందించారు. సినిమాలో తన గురించి చూపించింది కరెక్ట్‌ కాదని, కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్‌పై తనకున్న గౌరవం కారణంగా విషయం వదిలేస్తున్నానని చెప్పారు. ఇకపై దాని గురించి మాట్లాడను అని కూడా తేల్చి చెప్పారాయన.

ఒకరి వెర్షన్ మాత్రమే విని జీవిత కథలను సినిమా తీయడం వల్ల అసలు నిజాలు పక్కకు పోయే ప్రమాదం ఉందని సూచించారు. అలాగే గరివిడి లక్ష్మి పాటలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1993 ప్రాంతంలోనే కాలేజీ ఈవెంట్స్‌లో పాటలు పాడేవాడినని చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర జానపదం ఎవరి సొత్తూ కాదన్నారు. గరివిడి లక్ష్మి దగ్గరకు వెళ్లి పాటల ట్యూన్లు అడగాల్సిన అవసరం తనకు ఎప్పుడూ రాలేదని చెప్పారు.

అయితే, సోషల్‌ మీడియాలో ఓ పాత వీడియో సర్క్యులేట్‌ అవుతోంది. తాను పాడిన పాటల ఒరిజినల్‌ గరివిడి లక్ష్మివేనని, అంత మాస్‌ పాటలులా కాకుండా, కాస్త క్లాస్‌గా తాను ట్యూన్స్‌ చేశానని చెప్పారు. అయితే ఆ మాటలు, ఎప్పుడు, ఏ సందర్భంలో అన్నారు అనేది తెలియడం లేదు. దీంతో ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా అంటూ ఓ చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది.

గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus