RRR Movie: ఆ ఏరియాలో కూడా డౌన్ అయిన బిజినెస్

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ హిస్టరీలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలవుతున్న ఏకైక చిత్రం ఆర్.ఆర్.ఆర్. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ పై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. కేవలం మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఆర్.ఆర్.ఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్లకు పైగానే ఉంటుందని ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇక బాక్సాఫీస్ వద్ద ఈజీగా వెయ్యి కోట్ల మార్కును అందుకుంటుందని కూడా చెప్పవచ్చు.. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా బిజినెస్ తగ్గినట్లు సమాచారం. మొన్నటివరకు మార్కెట్ ను బట్టి నిర్మాతలు భారీ స్థాయిలో సినిమా రిలీజ్ హక్కులను అమ్మేశారు. కోస్తాంధ్రలో 107 కోట్ల ధర పలికినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆంద్రప్రదేశ్ లో టిక్కెట్ల ధరల తో పాటు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని నిర్మాత డి.వి.వి.దానయ్య అలాగే దర్శకుడు రాజమౌళి కూడా మళ్ళీ అక్కడ రేట్లను తగ్గించినట్లు తెలుస్తోంది.

కోస్తా ఆంధ్రాలో మళ్లీ చర్చలు జరిపి 80 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ టార్గెట్ ను అందుకోవడం సినిమాకు పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఇక అప్పటి కరోనా పరిస్థితులు అలాగే టికెట్ల ధరలు ఎలా ఉంటాయో చెప్పలేము. కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాత్రం ఎలా ఉంటాయో కాలమే నిర్ణయిస్తుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus