Rudhrudu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘రుద్రుడు’ ..!

  • May 15, 2023 / 11:37 AM IST

స్టార్ కొరియోగ్రాఫర్, టాప్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ ‘రుద్రుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యింది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ‌ఎల్‌ పి’ బ్యానర్ పై కతిరేశన్ సమర్పణలో ‘పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్’ ఠాగూర్ మధు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.

మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ నమోదైంది. ఫస్ట్ హాఫ్ చాలా వరస్ట్ గా ఉందని… సెకండ్ హాఫ్ పర్వాలేదు అని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మొదటి రోజు ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి.కానీ తర్వాత డౌన్ అయ్యాయి. ఫైనల్ గా డిజాస్టర్ గానే మిగిలింది ఈ మూవీ. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.81 cr
సీడెడ్ 0.50 cr
ఉత్తరాంధ్ర 0.37 cr
ఈస్ట్ 0.29 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు 0.22 cr
కృష్ణా 0.24 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.71 cr

‘రుద్రుడు’ (Rudhrudu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.2.71 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. రూ.4.09 కోట్ల నష్టాలతో డిజాస్టర్ గా మిగిలింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus