Rukmini Vasanth: ఆ బయోపిక్ మిస్ అయింది.. మరో సింగర్ కథతో రుక్మిణీ వసంత్
- October 23, 2026 / 01:18 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ సంగీత విధ్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్’ అనే ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసి, భారీ స్థాయిలో లాంఛనంగా ప్రారంభించారు కూడా. ఈ మేరకు జరిగిన ఓ కార్యక్రమంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగా ప్రముఖ కథానాయిక రష్మిక మందనను తీసుకొచ్చారు. అయితే అంతకుముందు వరకు ఆమె ప్లేస్‌లో వినిపించిన పేర్లలో రుక్మిణీ వసంత్ ఒకరు.
Rukmini Vasanth
ఎందుకో ఏమో కానీ.. రుక్మిణీ వసంత్ పేరు హఠాత్తుగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు మరో బయోపిక్ గురించి మాట్లాడేటప్పుడు రుక్మిణి పేరు చర్చలోకి వచ్చింది. సుప్రసిద్ధ గాయని జీవిత కథను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోంది అని చెబుతున్నారు. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.

గాయని పి.సుశీల (90) సుశీల స్వస్థలం విజయనగరం. 14కు పైగా భాషల్లో వేల పాటలు పాడారు. ఆమె పేరిట అత్యధిక పాటలు పాడిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఉంది. అయిదుసార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఒక్క తమిళంలోనే ఆరు వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులోనూ అంతే మొత్తంలో పాటలు పాడారని సమాచారం. గాయనిగానే కాదు, వ్యక్తిగతంగానూ ఆవిడ జీవితం నుండి ఎంతో నేర్చుకోవాలి. ఈ లెక్కన పి.సుశీల పాత్రను పోషించే అవకాశం రావడం రుక్మిణీ వసంత్‌కి ఇది మంచి అవకాశం.
ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే కాకుండా సంగీతం కూడా రెహమానే అందిస్తారు అని చెబుతున్నారు. అదే జరిగితే ఆయన కెరీర్లో ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. దీంతో ఈ సినిమా అనౌన్స్మెంట్ విషయంలో ఎలాంటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఎప్పుడు ఈ సినిమా గురించి క్లారిటీ వస్తుందో.











