Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 23, 2026 / 01:02 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఏగన్ (Hero)
  • శ్రీదేవి ఆపళ్ళ, ఫెమినా జార్జ్ (Heroine)
  • అదిర్చి అరుణ్, సుబ్రహ్మణ్యన్ సేతు, ఇందుమతి మణికందన్ తదితరులు (Cast)
  • యువరాజ్ చిన్నసామి (Director)
  • అరులనందు, మాథ్యూ (Producer)
  • సిద్దు కుమార్ (Music)
  • ప్రియేష్ గురుస్వామి (Cinematography)
  • శక్తి ప్రణేశ్ పి (Editor)
  • Release Date : 23rd అక్టోబర్ 2026
  • విజన్ సినిమా హౌస్ (Banner)

ఈ వారం పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. చిన్నచితకా సినిమాలే బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో ‘హైకూ’ ఒకటి. కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ఆపళ్ళ ఓ హీరోయిన్‌గా చేసిన తమిళ సినిమా ఇది. తెలుగు వెర్షన్ కూడా అదే రోజున రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమాతో శ్రీదేవి ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతోంది? తెలుసుకుందాం రండి:

Haiku Movie Review

Haiku Movie Review And Rating

కథ: మనోహర్ అలియాస్ మనో (ఏగన్) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడ్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో అతను కొంతమంది ట్రైనీస్‌కు (ఫ్రెషర్స్) శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్యాచ్‌లో ఒక అమ్మాయి నివేద (ఫెమినా జార్జ్). ఆల్రెడీ ఆమె ఒక అబ్బాయితో రిలేషన్‌లో ఉంటుంది. కానీ అతను ఈమెను ఎక్కువగా నిందిస్తూ, వేధిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఆమె తన లీడ్ అయిన మనోతో సన్నిహితంగా ఉండటం చూసి మరింతగా టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మనో.. నివికి ఎలా అండగా నిలబడ్డాడు? అసలు మనో గతం ఏంటి? అతను విమెన్స్ కాలేజీలో ఎందుకు గ్రాడ్యుయేషన్ చేయాల్సి వచ్చింది? అతని ప్రేయసి పవల్ కోడికి (శ్రీదేవి ఆపళ్ళ) అతను ఎందుకు దూరమయ్యాడు? చివరికి మనో, నివి జీవితాలు ఏమయ్యాయి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

Haiku Movie Review And Rating

నటీనటుల పనితీరు: ఏగన్ మనో పాత్రలో నేచురల్‌గా కనిపించాడు. కొన్ని చోట్ల అతన్ని చూస్తే ధనుష్, ప్రదీప్ రంగనాథన్ గుర్తుకొస్తారు. కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో ఇతను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఫెమినా జార్జ్ చూడటానికి బాగానే ఉంది. కానీ క్లోజప్ షాట్స్‌లో డల్‌గా ఉంది. అయినప్పటికీ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. శ్రీదేవి ఆపళ్ళ ఈ సినిమాలో మరీ చిన్నపిల్లలా కనిపించింది. ‘కోర్ట్’లో అంటే టీనేజ్ అమ్మాయిగా ఆమె సెట్ అయ్యింది. కానీ ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా సెట్ అవ్వలేదు. అందుకే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కే ఈమె పాత్రను పరిమితం చేసినట్టు ఉన్నారు. బ్రిగిడ ఒక సాంగ్‌లో కనిపించింది. మిగతా నటీనటుల పాత్రలు అంతగా గుర్తుండవు.

Haiku Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు యువరాజ్ చిన్నసామి తీసుకున్న పాయింట్ మంచిదే. కాకపోతే అతను తీసుకున్న పాయింట్ సినిమా క్లైమాక్స్‌లోనే వస్తుంది. అప్పటివరకు వచ్చే స్క్రీన్‌ప్లే అంతా పాత సినిమాల స్టైల్‌లో ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే విమెన్స్ కాలేజీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ట్రైలర్‌లో కూడా ఆ ట్రాక్ పెట్టి క్యూరియాసిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సినిమా స్టార్టింగ్‌లోనే ఆ ట్రాక్ వెనుక ఉన్న రీజన్ రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎక్కడ వచ్చిందో తెలీకుండానే హీరో, ఫస్ట్ హీరోయిన్ విడిపోతారు.

ఇక సెకండ్ హీరోయిన్‌తో ప్రేమాయణం మొదలైన తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అయితే మళ్ళీ ఫస్ట్ హీరోయిన్ ట్రాక్‌ను తీసుకొచ్చి.. సినిమాకి కన్క్లూజన్ అయితే ఇవ్వగలిగారు. కానీ పరిస్థితి అప్పటికే చేజారిపోయింది. సెకండాఫ్‌ను కొంచెం క్రిస్పీగా చెప్పే ప్రయత్నం చేయాల్సింది. నిర్మాణ విలువలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. ఒక కాలేజ్, ఒక ఫ్లాట్, ఒక ఆఫీస్.. మొత్తం సింపుల్‌గానే చుట్టేశారు. కాకపోతే సెట్స్ వంటివి ఎక్కువ లేకపోవడం వల్ల కొంత ఆర్గానిక్ ఫీలింగ్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా లేదు. సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే.

Haiku Movie Review And Rating

విశ్లేషణ: హైకూ ఇంట్రెస్టింగ్‌గా మొదలైనప్పటికీ.. ఆ తర్వాత కథలో కానీ, కథనంలో కానీ వేగం లేకపోవడంతో బోర్ కొట్టిస్తుంది. ఓటీటీకి వచ్చాక ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ సాయంతో ట్రై చేయొచ్చు కానీ, థియేటర్లలో ఈ సినిమాను వీక్షించడం ఇబ్బందిగానే అనిపిస్తుంది.

Haiku Movie Review And Rating

ఫోకస్ పాయింట్: ‘హైకూ’ ఇంత ల్యాగ్ కైకు!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aegan
  • #Femina George
  • #Haiku movie
  • #sri devi

Reviews

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

trending news

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

14 mins ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

47 mins ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago

latest news

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

6 mins ago
Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

31 mins ago
Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

20 hours ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

22 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version