Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

రుక్మిణి వసంత్‌.. ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్స్‌ కౌంట్‌ బాగా పెరిగిపోతోంది. రష్మిక మందనను తొలుత ఎలా అయితే నేషనల్‌ క్రష్‌ అన్నారో ఇప్పుడు ఈమెనూ అలానే అంటున్నారు. క్యూట్‌ లుక్స్‌, కళగా ఉండే ముఖం, మంచి మేని ఛాయకు హోమ్లీ టచ్‌ని మిక్స్‌ చేసిన రుక్మిణి నేటి యువతకు కలల రాణి అయిపోయింది. అయితే తాజాగా ఆమె ఓ ఈవెంట్‌కి వచ్చినప్పుడు వేసుకున్న డ్రెస్‌, రెడీ అయిన విధానం చూశాక మొత్తం ఇమేజ్‌ మారిపోయింది. రుక్మిణి అంటూ ఇన్నాళ్లూ ప్రేమగా మాట్లాడుకున్న ఫ్యాన్స్‌ ఇప్పుడు రుక్కు అదిరిపోయింది అని చిన్న మాస్‌ టచ్‌లోకి వచ్చేశారు.

Rukmini Vasanth

కెరీర్ ఆరంభంలో సంప్రదాయ పాత్రలు చేస్తే ఇక జీవితాంతం అలాంటి పాత్రలే వస్తుంటాయి హీరోయిన్లకు. ఆ ముద్రను చెరిపేయాలంటే చాలా కష్టం. కొన్నాళ్ల క్రితం వరకు కీర్తి సురేశ్‌.. ఇప్పుడు రుక్మిణి వసంత్‌ ఇదే పని చేస్తున్నారు. ఈ క్రమంలో రుక్మిణి లేటెస్ట్‌ అవుట్‌ఫిట్‌, లుక్ అదిరిపోయాయి. డైనమిక్‌ లుక్‌లో ఆమెను చూశాక ‘ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు రుక్మిణి మేడమ్‌ ఎలా ఉంది?’ అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే గ్లామర్‌ పాళ్లు బాగానే దట్టించకుండానే అదరగొట్టింది.

‘సప్తసాగరాలు దాటి’, ‘కాంతార’ సినిమాలతో ఒకే లాంటి ఇమేజ్‌ పొందిన రుక్మిణిని అలా చూసిన ఫ్యాన్స్‌ వావ్‌ అంటున్నారు. నిజానికి ఇలా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం కొత్తేమీ కాదు. కొన్ని రోజుల నుండి ఇలానే చేస్తూ వస్తోంది. ఇప్పుడు కనిపించిన లుక్‌ వాటికి పీక్స్‌ అని చెప్పొచ్చు. కొంతమంది అయితే ఇలా కంటిన్యూ చేస్తే టాలీవుడ్‌లో ఇకపై మాస్‌, స్టార్‌ హీరోల సినిమాల్లో రుక్మిణి భాగం కావడం ఇకపై కామన్‌ అయిపోతుంది అని అంటున్నారు.

కొన్ని ఏళ్ల క్రితం మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఇలానే ఇమేజ్‌ ఛేంజ్‌ చేసుకొంది. ‘సీతా రామం’ తర్వాత ఆమె మార్పును చూసి ఫ్యాన్స్‌ తొలుత నొచ్చుకున్నా.. ఆ తర్వాత మృణాల్‌ గ్లామర్‌ను చూసి ముచ్చటపడ్డారు.

విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus