బాలయ్య టార్గెట్ ఈజీ అయినా.. కష్టమే!

  • December 18, 2019 / 04:51 PM IST

నందమూరి బాలకృష్ణ 105 వ చిత్రంగా తెరకెక్కిన ‘రూలర్’ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. ‘సి.కె.ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘హ్యాపీ మూవీస్’ బ్యానర్స్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. సోనాల్ చౌహన్, వేదిక లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో భూమిక, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘జై సింహా’ కాంబినేషన్లోనే ఈ చిత్రం కూడా రూపొందింది కాబట్టి ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి కూడా బిజినెస్ బాగానే జరిగింది. ఇక ‘రూలర్’ చిత్రం ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 5.5 cr
సీడెడ్ 5 cr
ఉత్తరాంధ్ర 2.5 cr
ఈస్ట్ 1.6 cr
వెస్ట్ 1.4 cr
కృష్ణా 1.6 cr
గుంటూరు 2.7 cr
నెల్లూరు 1.1 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.3 cr
ఓవర్సీస్ 0.3 cr
వరల్డ్ వైడ్ టోటల్ 24 cr

‘రూలర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావలి అంటే 25 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. గతేడాది బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జై సింహా’ చిత్రం 29 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే డిసెంబర్ 20 న ‘ప్రతీరోజూ పండగే’ ‘దబంగ్ 3’ ‘దొంగ’ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇక బాలయ్య కెరీర్లోనే అతి తక్కువ థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలవుతుందట. మరి ఇలాంటి టఫ్ కాంపిటిషన్ లో ఈ చిత్రం ఎంత వరకూ కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus