స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య జోడీకి ప్రేక్షకుల్లో ఉండే గుర్తింపు, పాపులారిటీ అంతాఇంతా కాదు. అయితే ఎవరూ ఊహించని విధంగా చైసామ్ విడిపోతున్నట్టు ప్రకటన చేసి ప్రేక్షకులకు భారీ షాకిచ్చారు. చైతన్య సమంత విడిపోయిన తర్వాత నెటిజన్లలో చాలామంది సమంత పర్సనల్ డిజైనర్ అయిన ప్రీతమ్ ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. ప్రీతమ్ వల్లే సమంత చైతన్యకు విడాకులు ఇచ్చారని చాలామంది భావించారు. అయితే సమంత సోషల్ మీడియా పోస్టుల ద్వారా రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
చైతన్య, సమంత ఇప్పటికే పచ్చబొట్లను కూడా తొలగించుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దాదాపు సంవత్సరం క్రితం సమంత ‘సాకీ’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ ను మొదలుపెట్టారు. ‘సాకీ’ మొదలై సంవత్సరం పూర్తైన సందర్భంగా సమంత ఫ్యాన్స్ తో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించారు. సాకీలో SA అంటే సమంత కాగా AKI అంటే అక్కినేని అనే సంగతి తెలిసిందే. చైతన్య సమంత విడిపోయిన నేపథ్యంలో ‘సాకీ’ పేరు కూడా మారుతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మరి ‘సాకీ’ పేరును సమంత నిజంగా మారుస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు సమంత వరుస సినిమాలతో బిజీ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. సమంత కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. సమంత కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు