సినిమాలకు టెక్నాలజీ అదనపు హంగులు తెచ్చేలా ఉండాలి కానీ.. టెక్నాలజీతోనే సినిమా అంతా తీయకూడదు. గత కొన్ని ఏళ్లుగా టాలీవుడ్‌లో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ అయిపోయింది నేచురాలిటీ తగ్గిపోతోంది. దీంతో మనం తెరపై చూస్తున్నది మన హీరోనేనా అనే డౌట్ కూడా ప్రేక్షకులకు వస్తోంది. ‘మనోడేనా.. మనం చూస్తోంది మన హీరోనేనా?’ అనే మీమ్ కూడా మీరు చూసే ఉంటారు. మొన్న సంక్రాంతికి వచ్చిన ఓ సినిమా చూశాక ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రణబాలి’ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఆ వీడియో వైవిధ్యంగా ఉండటంతో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ ఆ సీన్ తెరకెక్కించారా అనే డౌట్ కూడా మొదైలంది. కొంతమంది నెటజ్లు ఆ వీడియోను ఏఐతో క్రియేట్ చేశారంటూ పోస్ట్‌లు పెట్టారు. దీనికి దర్శకుడు రాహుల్ క్లారిటీ ఇచ్చారు. వీడియోలోని ప్రతి ఫ్రేమ్ పాత పద్ధతుల్లోనే కష్టపడి డిజైన్ చేసినట్లు రాహుల్ తెలిపారు.
‘రణబాలి’ సినిమా వీడియోను సిద్ధం చేయడానికి మా టీమ్‌కు కొన్ని నెలల సమయం పట్టింది అని తమ శ్రమను చెప్పే ప్రయత్నం చేశారు రాహుల్. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లేకుండానే ఇలాంటి వీడియో డిజైన్ చేయడం సూపర్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. వావ్ ఇలా మా సినిమా కూడా తీసి ఉంటే బాగుండేది అని ఇటీవల ఫేస్ స్వాపింగ్ బాగా వాడిన సినిమాల హీరోల ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా గురించి చూస్తే.. స్వాతంత్రం రాకముందు దేశంలో బ్రిటిషర్ల అరాచకం పెట్రేగిపోతున్న రోజులు. రూ.లక్షల కోట్ల విలువైన సంపద హద్దులు దాటేసింది. లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక మేజర్ చేసిన అకృత్యాల వల్ల ఒక ప్రాంతం వల్లకాడయ్యే పరిస్థితి తలెత్తింది. సహాయం కోసం నోరు తెరవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న భారతీయులకు అండగా నిలబడేందుకు ఒక యువకుడు తెగించాడు. అతనే రణబాలి. జయమ్మగా రష్మిక మందన కనిపించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.