చాలా రొమాంటిక్ గా ‘సాహో’ బ్యూటీ ఎంగేజ్మెంట్..!

అవును ‘సాహో’ బ్యూటీకి ఎంగేజ్మెంట్ అయిపొయింది. అలా అని హీరోయిన్ శ్రద్దా కపూర్ కు అనుకోకండి. ‘సాహో’ లో అశోక చక్రవర్తి వాజి సిటీకి వచ్చిన తర్వాత అతనికి ప్రభాస్ ను పట్టించడానికి సహాయం చేసే పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఎవెలిన్‌ శర్మ. ఈ జర్మన్‌ బ్యూటీ కి తాజాగా నిశ్చితార్థం జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్‌ సర్జన్‌ తుషన్ బైనాండితో చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న ఎవెలిన్ ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఇప్పుడు ఈమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ప్రఖ్యాత హార్బర్‌ బ్రిడ్జి వద్ద తనకి కాబోయే భర్త తుషన్‌ కు లిప్ కిస్ ఇస్తూ… రొమాంటిక్‌ గా ఉన్నాయి. ఇక ఈమెకు ఎంగేజ్‌ మెంట్‌ జరిగిందని తెలుసుకున్న పలువురు సినీ సెలెబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జర్మనీలోనే పుట్టి పెరిగిన ఎవెలిన్ ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చింది, ఆపై ‘సాహో. అటు తరువాత ఈ ముద్దుగుమ్మ ద్వారా తెలుగు తెర కు పరిచయమైంది.

1

2

3

4

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus