యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ చిత్రం తర్వాత చేయనున్న చిత్రం గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటికి వస్తోంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ చిత్రానికి మొదట వంద కోట్లు బడ్జెట్ అనుకున్నారు. బాహుబలి కంక్లూజన్ ప్రభంజనం చూసిన అనంతరం ప్రభాస్ సినిమా అంటే ఓ రేంజ్ లో ఉండాలని బడ్జెట్ ని 150 కోట్లకు పెంచారు. బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషయన్లను ఈ చిత్ర బృందంలోకి తీసుకున్నారు. తాజాగా ఈ మూవీ బడ్జెట్ ని 225 కోట్లకు పెంచినట్లు తెలిసింది.
కారణం ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్ పెంచడమేనని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను ముంబై, అబుదాబి, రొమేనియా వంటి ప్రఖ్యాత ప్రదేశాల్లో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు సాహో కోసం 5 కోట్లతో రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ భాగం షూటింగ్ చేస్తారని తెలిసింది. విలన్లుగా బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే ఖరారు కాగా హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ పేరు వినిపిస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.