‘సాహో’ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్?

  • August 8, 2019 / 01:15 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఆగష్టు 30 న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. అంతేకాకుండా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగం పెంచారు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రంలో నటించే నటీనటులను అలాగే వారి పాత్రలకు సంబందించిన పోస్టర్లను విడుదల చేస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ డేట్ ను కూడా అనౌన్స్ చేసి మరింత ఆసక్తి పెంచారు.

ఆగష్టు 10 న ‘సాహో’ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలైన ‘యూవీ క్రియేషన్స్’ వారు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచాలని దర్శక నిర్మాతల గట్టి కసరత్తులు చేస్తున్నారు. అయితే విడుదల లోపు రెండు ట్రైలర్లు ప్లాన్ చేశారట ‘సాహో’ యూనిట్ సభ్యులు. ఆగష్టు 10 న మొదటి ట్రైలర్ ను విడుదల చేసి.. రెండో ట్రైలర్ ను విడుదలకు దగ్గర్లో విడుదల చేస్తారని సమాచారం. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ విజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus