Sabdham Collections: ‘శబ్దం’ .. జస్ట్ ఓకే అంతే..!
- March 3, 2025 / 06:22 PM ISTByPhani Kumar
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా వచ్చిన ‘శబ్దం’ (Sabdham) మూవీ ఫిబ్రవరి 28న రిలీజ్ అయ్యింది.అరివళగన్ (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ (S.S.Thaman) సంగీతం అందించడం జరిగింది. 14 ఏళ్ళ క్రితం ఇదే కాంబినేషన్లో ‘వైశాలి’ అనే సినిమా వచ్చింది. అది మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ‘శబ్దం’ పై డీసెంట్ బజ్ తో రిలీజ్ అయ్యింది. దీనికి కూడా పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ‘వైశాలి’ రేంజ్ టాక్ కాదు.
Sabdham Collections

ఇక ఓపెనింగ్స్ విషయంలో కూడా అంతే..! జస్ట్ ఓకే అనే రేంజ్లోనే వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.30 cr |
| సీడెడ్ | 0.12 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.30 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.72 cr |
‘శబ్దం’ సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి వీకెండ్ ఈ సినిమా కేవలం రూ.0.72 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.16 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి వీక్ డేస్ లో ఈ సినిమా ఎంత వరకు నిలదొక్కుకుంటుందో చూడాలి. దానిని బట్టే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.












