Sachin: సచిన్ తొలి సినిమా ఆ మెగా హీరోతోనేనా..?

Advertisement

ఈమధ్య కాలం లో మన ఇండియన్ క్రికెటర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారు. గతం లో హర్భజన్ సింగ్ హీరో గా ఒక చిత్రం చేసాడు. ఆ సినిమా ట్రైలర్ అయితే విడుదల అయ్యింది కానీ ఇప్పటి వరకు థియేటర్స్ లో విడుదలకు నోచుకోలేకపోయింది. ఇకపోతే మహేంద్ర సింగ్ ధోని రీసెంట్ గానే తన భార్య సాక్షి తో కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించాడు.

ఈ సంస్థ నుండి వచ్చిన మొదటి సినిమా ‘LGM’. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, ధోని తన తదుపరి చిత్రాలను మొత్తం క్రేజీ స్టార్ హీరోలతోనే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. ధోని సంగతి కాసేపు పక్కన పెడితే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా త్వరలో ఒక నిర్మాణ సంస్థ ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం.

ఆయన మొదటి సినిమాని భారీ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియా లో పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా అన్నీ బాషలలో సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈయన సినిమా సక్సెస్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మామూలు రేంజ్ లో ఉండవు అని నిర్మాతల గట్టి నమ్మకం. ఎన్నో సార్లు అది రుజువు అయ్యింది కూడా.

అలాంటి హీరో అయిన రామ్ చరణ్ తో సినిమా చెయ్యాలని (Sachin) సచిన్ టెండూల్కర్ ప్లాన్ చేస్తున్నాడట. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం సచిన్ టెండూల్కర్ తో ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం కొనసాగిస్తూ వస్తుంది. ఆ చనువు తోనే సచిన్ టెండూల్కర్ తనకి ఒక సినిమా చేసి పెట్టమని రామ్ చరణ్ ని అడగడం , ఆయన వెంటనే ఒప్పుకోవడం జరిగిందట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus