పాపం మెగాహీరో పంచె ఊడిందట!
- June 13, 2016 / 11:52 AM ISTByFilmy Focus
సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో కొన్ని కొన్ని తమాషా సంఘటనలు జరుగుతుంటాయి. అవెప్పుడు తలచుకొన్నా… సరదాగా ఉంటాయి. అవే తీపి గురుతులుగా మిగిలిపోతాయి. సుప్రీమ్ సెట్లోనూ అలాంటి తమాషా సంఘటన ఒకటి జరిగిందట.
సుప్రీమ్ సినిమా చూస్తే.. అందులో సాయిధరమ్ తేజ్ తెల్ల చొక్కా. తెల్ల పంచె కట్టుకొని గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి అడగడానికి వెళ్ళినట్లు రాశీ ఖన్నా ఇంటికి వెళ్తాడు తేజు. అక్కడ రాశీఖన్నా ఫ్యామిలీని సరదాగా బ్లాక్‌మెయిల్ చేస్తూ డైలాగులు చెబుతాడు. నిజానికి ఆ సీన్ టేక్ చేస్తున్నప్పుడు.. సాయిధరమ్ తేజ్ గడగడ డైలాగులు చెప్పేస్తుంటాడు. ఆ సమయంలోనే కాళ్లకు ఏదో తాకుతుంటే.. చూశాడట. అయితే అప్పటికే పంచె ఊడిపోయిందట. సీన్లో పడి.. ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదట.
ఆ తరవాత సాయి వాలకం చూసి… ఒకటే నవ్వులట. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజే బయటపెట్టాడు. ప్రస్తుతం తేజు ‘తిక్క’ సినిమాలో నటిస్తున్నాడు. అలానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.
https://www.youtube.com/watch?v=Kh1QWhXdS5I












