ప్రేమకథలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా.. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం కరుణాకరణ్ తెరకెక్కిస్తున్న ఈ లవ్ స్టోరీ ఓ హాలీవుడ్ సినిమా ఫ్రీమేక్ అని తెలుస్తోంది.
ఇదివరకు కూడా “ఎందుకంటే ప్రేమంట” సినిమా కోసం ఒక హాలీవుడ్ సినిమాని లేపేసిన కరుణాకరణ్ అదే తరహాలో తాజా చిత్రం కోసం కూడా హాలీవుడ్ లో 2012లో విడుదలైన “వొవ్” (VOW) అనే చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అయిదేళ్ళ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపిన అనంతరం ఒక యాక్సిడెంట్ లో గతాన్ని మర్చిపోయిన్ భార్యను మళ్ళీ ప్రేమించి ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం ఒక యువకుడు పడే తపనే చిత్ర కథాంశం. కథ వినడానికి అద్భుతంగా ఉండడమే కాక మంచి ఫీల్ ఉన్న స్టోరీ. అందువల్ల రీమేక్ చేసినా పెద్ద ప్రోబ్లమ్ ఏమీ అవ్వదు. చూద్దాం మరి నిజంగా ఆ సినిమాని రీమేక్ చేస్తున్నాడా లేక ఆ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని వేరే సినిమా తీస్తున్నాడో.