Sai Dharam Tej: దేవుడ్ని నమ్ముతాను కానీ అవి ఇష్టం ఉండదన్న సాయితేజ్.. ఏమైందంటే?

  • April 4, 2023 / 09:28 PM IST

సాయితేజ్ హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కిన విరూపాక్ష మూవీ ఈ నెల 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కచ్చితంగా సాయితేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయితేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో రుద్రాక్షను పోలిన తాడును కట్టుకొని ఎక్కువగా కనిపిస్తున్న సాయితేజ్ ఆ తాడు తన చేతికి రోజూ ఉంటుందని చెప్పుకొచ్చారు.

క్రికెట్ ఆడుతున్న సమయంలో, వర్కౌట్లు చేస్తున్న సమయంలో, షూటింగ్ సమయంలో మాత్రమే ఈ తాడును తీసి పక్కన పెడతానని సాయితేజ్ చెప్పుకొచ్చారు. మిగతా సమయంలో మాత్రం ఈ తాడు నా చేతికి ఉంటుందని సాయితేజ్ అన్నారు. ఈ తాడు నాకు మా అమ్మ ఇచ్చిందని సాయితేజ్ చెప్పుకొచ్చారు. నాకు దేవుడంటే మొదటినుంచి నమ్మకమని సాయితేజ్ చెప్పుకొచ్చారు. అయితే పూజలు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదని సాయితేజ్ వెల్లడించారు. ఆంజనేయ స్వామి నా బెస్ట్ ఫ్రెండ్ అని సాయితేజ్ కామెంట్లు చేశారు.

నాకు ఎటువంటి సమస్య వచ్చినా దేవునికి చెప్పుకుంటానని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దేవుడు ఇప్పటివరకు కలలోకి రాలేదని సాయితేజ్ కామెంట్లు చేయడం గమనార్హం. దేవునితో అంత అధ్యాత్మిక బంధం ఏర్పడలేదని సాయితేజ్ చెప్పుకొచ్చారు. సాయితేజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సాయితేజ్ (Sai Dharam Tej) పవన్ తో కలిసి వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలో సాయితేజ్ మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం. సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సాయితేజ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus