టాలీవుడ్ ఫ్యామిలీస్ లో బడా ఫ్యామిలీగా చెప్పుకునే మెగా ఫ్యామిలీ నుంచి నెలకొకరు హీరోగా వస్తూ ఉన్నారు. అదే క్రమంలో మెగా అభిమానులు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ఆయా హీరోలని గుడేల్లో పెట్టుకుని మరీ ఆ హీరోలను సక్సెస్ఫుల్ హీరోస్ గా నిలుపుతున్నారు. అదే క్రమంలో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ తొలి సినిమా రేయ్ డమాల్ అని అన్నప్పటికీ మిగిలిన సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో కాస్త హీరోగా నిలదొక్కుకోగలిగాడు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా ఈ హీరోని తమ హీరోల జాబితాలో కలిపేసుకున్నారు.
అయితే వరుసగా హిట్స్ వచ్చిన అతి ఆలోచనో, లేక సెటిల్ అయిపోయాను అన్న అతి నమ్మకమో తెలీదు కానీ, వరుస హిట్స్ తో పోతున్న సాయి ధర్మ తేజ తిక్క అనే ప్రయోగాత్మక చిత్రాన్ని చేసి జనాలకి తిక్క కుదిర్చాడు. ఆ సినిమా డిజాస్టర్ గా మారడంతో చాలా అన్ హ్యపీగా ఉన్నాడు తేజు. ఇదే క్రమంలో తాజాగా తిక్క మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఆ మీట్ కి హీరో తేజు మినహాయిస్తే దాదాపు టీమ్ అంతా హాజరయ్యారు. బ్రెజిల్ భామ లారిస్సా కూడా సందడి చేసింది. అయితే ఎంత సినిమా ఫ్లాప్ అయినా మన హీరోగారు సక్సెస్ మీట్ లో కనిపించకపోవడానికి కారణం ఏంటి అంటే…తన ఎఫర్ట్ ను రివ్యూల్లో గుర్తించకపోవడమే అని తెలుస్తోంది. డిఫరెంట్ మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో.. వరుసగా హిట్స్ కొట్టి ఊపు మీద ఉన్న తాను ఓ ప్రయోగం చేస్తే.. దానికి గుర్తింపు రాకపోగా..విమర్శలు రావడం తట్టుకోలేకపోయాడని అంటున్నారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రివ్యూస్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు దానికి ఉందాహరణ…సాయి సినిమా సుప్రీమ్ కి కూడా ఇలాంటి రివ్యూలే వచ్చినా సక్సెస్ సాధించిన విషయాన్ని తాను గుర్తించాలి. ఏది ఏమైనా…ఒక్క ఫ్లాప్ కే ఇలా డీలా పడిపోతే మున్ముందు ఇంకా ఎన్నో హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూడాల్సి వస్తుంది అప్పుడు ఏమైపోతాడో మన మెగా హీరో.