మరో ఛాలెంజింగ్ రోల్లో సాయి పల్లవి

  • May 17, 2018 / 08:07 AM IST

కమర్షియల్ హీరోయిన్స్ అనగానే బికినీ అందాలతో.. అదిరిపోయే స్టెప్పులు వేస్తే సరిపోతుంది. ఇటువంటి భామలకే ప్రస్తుతం క్రేజ్ ఉంది. ఈ పోటీలో స్కిన్ షో లేకుండా అభినయంతోనే సాయి పల్లవి క్రేజ్ సంపాదించుకుంది. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఆకట్టుకున్న ఈమె తెలుగులో అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి అందరినీ ఫిదా చేసింది. అంతేకాదు కణం మూవీలో తల్లి పాత్రలో మెప్పించింది. తాజాగా “పడిపడి లేచే మనసు” మూవీలో బెంగాలీ భామగా అలరించనుంది.

ఇలా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్న సాయి పల్లవి ఆటో డ్రైవర్ పాత్ర పోషించడానికి రెడీ అవుతోంది. హీరో ధనుష్ నటించిన “మారి” 2015లో వచ్చి విజయవంతమైంది. అందుకు  సీక్వెల్ గా “మారి-2 ” రూపొందుతోంది. బాలాజీ మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ధనుష్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ పాత్ర కోసం ఆమె డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందని వెల్లడించాయి. ఈ పాత్రలోనూ అందరిని సాయి పల్లవి మెప్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus