సాయి పల్లవికి విజయ గర్వం తలెకెక్కిందా? అంటే అవుననే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఆమె మలయాళంలో చేసిన “ప్రేమమ్(మలయాళం)” సినిమా సూపర్ హిట్ అయింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో చేసిన ఫిదా మూవీ కూడా సూపర్ హిట్ అయింది. సాయి పల్లవి నటన వల్లే సినిమా విజయం సాధించిందని అందరూ అభినందించారు కూడా. ఇప్పుడు నాని సరసన నటిస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సెట్ లో నాని తో గర్వంగా ప్రవర్తిస్తోందని సమాచారం. “అంతా నా ఇష్టం” అన్నట్టుగా వ్యవహరిస్తోందని తెలిసింది.
దీంతో నానికి, సాయి పల్లవికి మధ్య చిన్న గొడవ కూడా వచ్చిందని టాక్. ఇక నిన్న షూటింగ్ కు లేటుగా రావడంతో “ఎందుకు లేటయింది” అని అసిస్టెంట్ డైరెక్టర్లు అడిగితే సరిగా సమాధానం కూడా చెప్పలేదని చిత్ర బృందం వెల్లడించింది. దీంతో సాయి పల్లవికి గర్వం వచ్చిందని సెట్ లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె తీరు మార్చుకోకుంటే కొత్త ఛాన్స్ లు కాదు కదా, వచ్చిన ఆఫర్లు సైతం వెనక్కి వెళ్ళిపోతాయని టాలీవుడ్ వర్గాలవారు సాయి పల్లవిని హెచ్చరిస్తున్నారు.