నటి సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తన నటన, డాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంటుంది. రీసెంట్ గా ‘శ్యామ్ సింగరాయ్’లో ఆమె పెర్ఫార్మన్స్ ని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. తన కెరీర్ లో ఎక్కడా కూడా నెగెటివిటీ అనేది ఫేస్ చేయలేదు ఈ బ్యూటీ. అయితే మూడేళ్ల క్రితం సాయిపల్లవిపై యంగ్ హీరో నాగశౌర్య విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
వీరిద్దరూ కలిసి ‘కణం’ అనే సినిమాలో నటించారు. అయితే షూటింగ్ సమయంలో సాయిపల్లవి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని శౌర్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నాగశౌర్య చేసి కామెంట్స్ కి సమాధానమిచ్చింది సాయిపల్లవి. రీసెంట్ గా ఈ బ్యూటీ బాడీషేమింగ్ కి గురైన సంగతి తెలిసిందే. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసిగా సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వచ్చింది. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది సాయిపల్లవి.
అదే సమయంలో శౌర్య ప్రస్తావన రాగా.. ‘నా వలన ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే నాకు బాధగా ఉంటుంది. శౌర్య నాపై చేసిన కామెంట్స్ తెలిసి బాధపడ్డాను. ‘కణం’ సినిమా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కి ఫోన్ చేసి నా వలన ఇబ్బంది పడ్డారా..? అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. నటుడిగా నాగశౌర్యపై ఎంతో గౌరవం ఉందని.. తనలో నచ్చని గుణం ఆయన బయట చెప్పారని..
కానీ ఆ విషయాన్ని పాజిటివ్ గా తీసుకున్నానని చెప్పింది. నిజంగానే సెట్ లో తన కారణంగా ఇబ్బంది కలిగి ఉంటే అది తనను బాధించే విషయమే అని.. ఈ సమాధానంతోనైనా శౌర్య సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!