Sai Pallavi: లేడి పవర్ స్టార్ అని పిలిపించుకోవడం అతిగా అనిపిస్తుంది: సాయి పల్లవి

  • June 15, 2022 / 05:10 PM IST

నేచురల్ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన నటనతో అందరిని ఫిదా చేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన నటి సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె దగ్గుబాటి రానా సరసన నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలకు ఒక రోజు సమయం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు.

ఇలా ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈమెకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఒక సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి పల్లవిని ఉద్దేశించి అదే కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సుకుమార్ సాయి పల్లవికి ఈ విధమైనటువంటి బిరుదు ఇచ్చారు. సుకుమార్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తనకు అలాంటి బిరుదు ఇవ్వడం మాత్రం తప్పు లేదని అభిమానులు సైతం తనని లేడీ పవర్ స్టార్ అంటూ పిలవడం మొదలు పెట్టారు.

తాజాగా విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయి పల్లవి లేడి పవర్ స్టార్ అనే బిరుదు పై స్పందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అలా పిలిపించుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. ఎవరైనా తనని లేడి పవర్ స్టార్ అని పిలిస్తే తనకు కాస్త అతిగా అనిపిస్తుందని, నేను ఇక్కడికి గౌరవంగా పని చేయడం కోసమే వచ్చానని, స్టార్డమ్ చూసి వచ్చే వాళ్ల కోసం కాదని ఈమె తెలిపారు.

ఇలా తనకు ఇచ్చిన బిరుదు గురించి సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇలా ఈమె తనకు గొప్పలు వద్దంటూ పరోక్షంగా చెప్పడంతో మరోసారి ఆమె అభిమానులు తన వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే కదా మీరు ఎంతో మందికి అభిమాన నటిగా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus