సాయి పల్లవి ‘డియర్ కామ్రేడ్’ లో చేయకపోవడానికి కారణమదే..!

Advertisement

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ హీరోగా వస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ర‌ష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. జూలై 26 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను ఇటీవ‌లే విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. విడుదల మరో వారంలో ఉండడంతో… ప్ర‌మోష‌న్లను వేగవంతం చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే విజ‌య్, రష్మిక కొన్ని ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…. “ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇద్ద‌రినే అనుకున్నాం. ఒకరు సాయి ప‌ల్ల‌వి, రెండు ర‌ష్మిక. వాళ్ళైతేనే ఈ పాత్ర‌కు కరెక్ట్ గా సరిపోతార‌ని భావించాం. ముందుగా సాయి ప‌ల్ల‌వికి క‌థ వినిపించాం. క‌థ ఆమెకు బాగా న‌చ్చింది. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత ర‌ష్మిక క‌థ వినింది. విన్న వెంట‌నే ఓకే చెప్పేసింది. అలా రష్మిక ని హీరోయిన్‌గా ఫిక్స్ చేశాం” అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో లిప్‌లాక్ సీన్లు ఎక్కువ ఉండడం వలనే సాయి పల్లవి ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్టు స్పష్టమవుతుంది. గ్లామర్ పాత్రలకి ఆమె దూరంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ విజయ్ కు మాత్రం తాను చేసే సినిమాల్లో లిప్ లాకులు కచ్చితంగా ఉండాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus