మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా తెరకెక్కిన హర్రర్ కామిడీ మూవీ ‘కొరియన్ కనకరాజు’ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు వేశారు మేకర్స్. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘వరుణ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడని’ ‘వరుణ్ తేజ్ ఈజ్ బ్యాక్ అని’ ‘వరుణ్ తేజ్, సత్య కామిడీ సూపర్ అని’ ఇలా రకరకాలుగా సినిమాపై కొందరుప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ సత్య పలికిన ఒక డైలాగ్ పై మాత్రం ఇప్పుడు నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ నటించిన పాత సినిమాలోని ఓ సన్నివేశం కొద్దిరోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సన్నివేశంలో ‘మీ స్ట్రోక్స్ కొంచెం అమెచ్యురిష్ గా ఉన్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడైనా ఫైట్ చేశారా?’ అంటూ సీనియర్ ఎన్టీఆర్ పలుకుతారు. గత 4 రోజుల నుండి ఈ సీన్ ఎక్కువగా వైరల్ అవుతుంది. కట్ చేస్తే.. ఆ డైలాగ్ ‘కొరియన్ కనకరాజు’ లో ఉండటంతో… కావాలనే మేకర్స్ లాస్ట్ మినట్ లో ఆ సీన్ పెట్టి ఉంటారు అని కొంతమంది భావిస్తున్నారు.
దీంతో వెంటనే ఆ డైలాగ్ ను డిలీట్ చేయాలంటూ నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలకి ‘కొరియన్ కనకరాజు’ టీం చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో… ” ఆ సీన్ నవంబర్లోనే షూట్ చేశామని, గొప్ప గొప్పవాళ్లని ఇమిటేట్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం అని, ట్రోలింగ్ కి ట్రెండింగ్ కి మధ్య ఉండే వ్యత్యాసాన్ని అంతా గమనించాలని’ టీమ్ కోరింది. అంతేకాదు గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ సీన్ ట్రెండ్ అయ్యిందని… ఆ టైమ్లోనే షూట్ చేసినట్టు కూడా వివరణ ఇచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై ‘కొరియన్ కనకరాజు’ టీమ్ వివరణ
ఆ సీన్ గతేడాది నవంబర్లో షూట్ చేశాం
ట్రోలింగ్ చేయడం.. ఇమిటేట్ చేయడం.. రెండూ ఒకటి కాదు
మా సినిమాలో సత్య సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశాడు.. ట్రోల్ చేయలేదు
గొప్ప గొప్ప వాళ్ళని ఇమిటేట్ చేయడం తప్పు… pic.twitter.com/Gsqeml1Qlk
— Filmy Focus (@FilmyFocus) August 7, 2026