Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

మూడేళ్ల క్రితం ‘విరూపాక్ష’ అనే మంచి విజయం అందుని, ‘బ్రో’ సినిమాతో తన చిరకాల కోరిక నెరవేర్చుకుని.. ఆ తర్వాత ఇప్పటివరకు సినిమా ఇవ్వలేదు సాయి తేజ్‌. ‘సంబరాల యేటిగట్టు’ అంటూ గతేడాది అంతా సినిమా చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అన్ని రోజులు పడుతోంది అనేది తెలియదు కానీ.. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియడం లేదు. నిజానికి ఈ సినిమా ఈపాటికి విడుదలైపోయి ఉండాలి కూడా. ఈ సినిమా రిలీజ్‌ ఎప్పుడు అనేది టీమ్‌ ఇప్పటికీ చెప్పడం లేదు..

Sai Tej

ఆ విషయం అలా ఉంచితే మూడేళ్ల వరకు సినిమా ఇవ్వకుండా చాలా గ్యాప్‌ ఇచ్చిన సాయితేజ్‌ ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి రెడీ అయపోతున్నాడు. ఇప్పటికే రెండు కథలకు దాదాపు ఓకే చెప్పిన తేజ్‌.. మూడో కాంబినేషన్‌లో విషయంలో ఉత్సుతకతో ఉన్నాడని.. త్వరలో కథ ఫైనల్‌ చేసుకుంటే ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేస్తారని చెబుతున్నారు. దీంతో ఇన్నాళ్ల గ్యాప్‌ ఫిల్‌ చేసేలా ప్రాజెక్ట్‌లు ఉండనున్నాయని అంటున్నారు.

‘సేవ్ ది టైగ‌ర్స్‌’ వెబ్‌ సిరీస్‌తో ఆక‌ట్టుకున్న యువ ద‌ర్శ‌కుడు తేజ కాక‌మాను ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ఈ సినిమా ఉండబోతోందట. తేజ చెప్పిన కథ తేజ్‌కి న‌చ్చ‌డంతో త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేస్తుందని సమాచారం.

 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus