ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ , మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ కారణం ఏదైనా సరే ట్రెండ్ చేయడంలో మాత్రం ముందుంటున్నారు. మహేష్ బాబు సినిమాకి సంబంధించిన దేనినైనా సరే యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేసేస్తున్నారు. అలాగే, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మేమేం తక్కువ తినలేదు అంటూ ప్రతి ఐటమ్ ని యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేయడం అనేది మొదలెట్టేశారు. ఇందులో భాగంగా సలార్ షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో సలార్ మీనింగ్ కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ అందరూ.
సలార్ మీనింగ్ ఇన్ తెలుగు అని గూగుల్ లో సెర్చ్ చేస్తుంటే పాలకూర అని అర్ధం వస్తోంది. అందుకే ఇప్పుడు యాష్ ట్యాగ్ పెట్టి పాలకూర ఫోటోలని ట్యాగ్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పాలకూర ట్యాగ్ ఫేమస్ అయ్యింది. ఇంకో విశేషం ఏంటంటే, ప్రభాస్ కి పాలక్ పన్నీర్ అంటే బాగా ఇష్టం. దీంతో ఇంకొంచెం ఫ్రెష్ గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ.
అసలు సలార్ అంటే మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సలార్ అంటే అంటే రాజు కి కుడిభుజంగా ఉంటూ ప్రజలని రక్షించే సమర్ధవంతమైన నాయకుడు అని అర్ధం అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్య్వూలో చెప్పాడు. మరి ఈ నాయకుడు అయిన రెబల్ స్టార్ ని మరోసారి కిక్ ఇచ్చేలా సిల్వర్ స్క్రీన్ పైన చూపించబోతున్నాడు డైరెక్టర్. గోదావరి ఖనిలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది మూవీటీమ్. శృతిహాసన్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మిగతా స్టార్ కాస్టింగ్ ని అతి త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. అదీ మేటర్.