Salaar: సలార్ మూవీ టార్గెట్ అన్ని వేల కోట్లా.. ఆ విషయంలో సక్సెస్ అవుతుందా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా కోసం అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు ఆదిపురుష్ సినిమాతో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరిగినట్టు సమాచారం అందుతోంది. ప్రభాస్ క్రేజ్ కు ప్రశాంత్ నీల్ పాపులారిటీ యాడ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

సలార్ మూవీ ఓవర్సీస్ హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 200 కోట్ల రూపాయలకు అమ్ముడవగా హిందీ హక్కులు 150 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. సలార్ మూవీ ఇతర హక్కులు కూడా కలిపితే ఈ సినిమా దాదాపుగా 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్టు అవుతుందని తెలుస్తోంది.

ఆదిపురుష్ మూవీ కొన్ని ఏరియాలలో నష్టాలను మిగల్చగా సలార్ విషయంలో మాత్రం ఆ తప్పు జరగదని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాను మరీ భారీ బడ్జెట్ తో నిర్మించి తప్పు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా దెబ్బకు మైథలాజికల్ సినిమాలను తెరకెక్కించాలన్నా, నిర్మించాలన్నా నిర్మాతలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందనే సంగతి తెలిసిందే. సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ప్రభాస్ కు కెరీర్ బెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సలార్ (Salaar) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కూడా రానున్నాయి. సలార్ సినిమాలో మైండ్ బ్లాంక్ అయ్యే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయని తెలుస్తోంది. సలార్ మూవీ టార్గెట్ 2,000 కోట్ల రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus