ఈ ఏడాది డిసెంబర్ నెల 22వ తెదీన సలార్, డంకీ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల పోటీపై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం. అయితే డంకీ సినిమా మేకర్స్ మొదట తాము రిలీజ్ డేట్ ను ప్రకటించడం సలార్ వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒకేరోజు కాకుండా సలార్ మూవీ రిలీజ్ డేట్ ను మార్చాలని డంకీ మేకర్స్ కోరుతున్నట్టు భోగట్టా.
మరోవైపు నార్త్ ఇండియాలో సలార్ సినిమాకు థియేటర్లు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. అయితే సలార్ మేకర్స్ మాత్రం ఎన్ని కుట్రలు జరుగుతున్నా ఆ కుట్రలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సలార్ మేకర్స్ మాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని భోగట్టా. సలార్ తో పోటీ వల్ల తమకు ఇబ్బందేనని డుంకీ (Dunki) మేకర్స్ ఫీలవుతున్నారని సమాచారం.
సలార్1 సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారని భారీ లెవెల్ లో ఈ సినిమాను రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్ రిలీజ్ డేట్ ను మార్చితే మాత్రం తాము అస్సలు అంగీకరించమని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. ప్రభాస్ సలార్ మూవీ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
సలార్ సినిమాకు ఏ సినిమా పోటీగా విడుదలైనా ఆ సినిమాకే రిస్క్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్2 సినిమాకు సంబంధించి కూడా త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలకు భారీ లాభాలు వస్తున్నాయి. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.