లేడీ ఓరియెంటెడ్ సినిమాలు విజయం సాధించడమనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగులో అనుష్క ఈ తరహా కథల్లో విజయాలను అందుకుంది. తమిళంలో నయనతార లేడీ ఓరియెంటెడ్ కథలతో విజయాలు అందుకుంటోంది. అదే విధంగా తెలుగు, తమిళంలో ఒకేసారి సమంత లేడీ ఓరియెంటెడ్ కథలో నిరూపించుకోవాలని .. కన్నడ లో హిట్ సాధించిన కథతో యూ టర్న్ సినిమా చేసింది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వినాయకచవితి సందర్బంగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 13 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. సినీ విశ్లేషకులతో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా బీ, సీ సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.
భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తొలి రోజే కోటీ వసూలు చేసింది. దీంతో ఊహించినదానికంటే ఎక్కువ వసూళ్లులను రాబడుతుందని అనుకున్నారు. కానీ రోజు రోజుకి కలక్షన్స్ తగ్గుకుంటూ వచ్చిందని ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలను మిగిల్చిందని వెల్లడించారు. ఈ ఫలితం సమంతని నిరాశపరించింది. అందుకే ఇక నుంచి లేడీ ఓరియెంటెడ్ కథలను చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కేవలం గ్లామర్ రోల్స్ కే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.