ఒక్కోసారి ‘ఫెయిల్ అవుతుంది’ అనుకోని చేసిన ప్రయత్నం సూపర్ హిట్ అవుతుంది, తప్పకుండా ‘హిట్’ అని ఫిక్స్ చేసిన పనేమో డిజాస్టర్ అవుతుంది. ఆ విధంగా “ఏమవుతుందో?” అని సమంత భయంభయంగా చేసిన ఓ పని ఇప్పుడు ఆమెకు ఎక్కడలేని పేరు తెచ్చిపెడుతోంది. “మహానటి” సినిమాలో మధురవాణి పాత్రకు మొదట్నుంచి సొంతంగా డబ్బింగ్ చెప్పమని కోరుతూనే ఉన్నాడట నాగఅశ్విన్. అయితే.. మొదట్లో భయపడిన సమంత, ఆ తర్వాత మాత్రా క్యారెక్టర్ కి ఎలాగూ నత్తి ఉంది కాబట్టి.. ఏవైనా తప్పులున్నా ఆ “నత్తి”లో కొట్టుకుపోతుందిలే అనుకొందట. కానీ.. ఇప్పుడు తన సొంత డబ్బింగ్ కి వస్తున్న పేరు చూసి.. ఇకపై తన సినిమాలకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యిందట.
అలాగే.. “మహానటి”లో నటించిన తర్వాత చాలా విషయాలు నేర్చుకొన్నానని, ఇకపై తాను ఎంచుకొనే కథల విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తానని చెప్పింది. అలాగే.. తన అదృష్టమో మరొకటో తెలియదు కానీ.. ఇప్పటివరకు తాను “నో” చెప్పిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాని సమంత పేర్కొనడం విశేషం. ఇకపోతే.. పెళ్లయ్యింది కాబట్టి ఇకపై రోమాటిక్ సినిమా చేయను అని చెప్పను, ఎందుకంటే రొమాన్స్ అనేది కూడా నటనలో భాగమే. ఇక ఎన్టీయార్ గురించి మాట్లాడుతూ.. “తారక్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో, ఇక నా తొలి కథానాయకుడు, నా భర్త అయిన నాగచైతన్యతో నటించడం నాకు ఎప్పటికీ స్పెషలే” అని చెప్పుకొచ్చింది మన రామలక్ష్మి.