నటుడిగా మంచి పేరుతెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం “చిలసౌ”. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 3న రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీపై మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈసారి సుశాంత్ గట్టిగానే కొడుతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగానే సమంత, నాగచైతన్య తదితరులు చూశారు. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు. ”పదకొండు ఏళ్లుగా నేను, రాహుల్ మంచి మిత్రులం. నా కెరీర్ బిగినింగ్ నుంచి ఈ స్టేజ్ వరకు రాహుల్ నాకు సపోర్ట్ అందిస్తూ వచ్చాడు.
తనకు మంచి భవిష్యత్ ఉండాలని నేను ఆ దేవుడ్ని చాలా సార్లు ప్రార్థించాను. తను మంచి హార్డ్‌వర్కర్. ఈ సినిమాను అతను చూడమనగానే.. భయపడుతూ చూశాను. ఎందుకంటే.. నా స్నేహితుడు యాక్టింగ్‌ను దాటి డైరెక్టర్ కావాలనుకుని ఆశగా చేసిన సినిమా. చూసిన తర్వాత ఏం చెప్పాల్సి వస్తుందోనని అనుకున్నాను. సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాహుల్ యాక్టర్‌గా నాకు కనెక్ట్ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్ అయ్యాడు.” అని రాహుల్ పై సమంత ప్రసంశలు గుప్పించింది. ఇక నటీనటుల గురించి మాట్లాడుతూ “ఈ సినిమాలో కొత్త సుశాంత్‌ని తెరపై చూస్తారు. ఈ సినిమాలో రాహుల్‌పై నమ్మకంతో సుశాంత్ నటించాడు. ఆ కాన్ఫిడెన్స్ స్క్రీన్‌పై కనపడుతుంది. రుహని ఫైర్ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది. ఆమెకు అవార్డ్స్ కూడా వస్తాయి” అని ఆశాభావం వ్యక్తం చేసింది.