Samantha: సమంతని మళ్ళీ అప్రోచ్ అయిన పుష్ప నిర్మాతలు?

  • February 17, 2023 / 09:27 PM IST

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు పెరుగుతాయి. పుష్ప కి ముందు కూడా ఈ కాంబినేషన్ పై చాలా క్రేజ్ ఉండేది. ఎందుకంటే ఆర్య , ఆర్య 2 వంటి చిత్రాలు ఈ కాంబోలో రూపొందాయి కాబట్టి..! పుష్ప ది రైజ్ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు పాన్ ఇండియా స్థాయిలో విస్తరించడానికి కారణం సమంత పై చిత్రీకరించిన ఐటెం సాంగ్ అనే చెప్పాలి.

ఊ అంటావా మావా ఊఊ అంటావా అంటూ సాగే ఐటెం సాంగ్ రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యింది. అందువల్ల ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి కారణం అయ్యింది. ఈ క్రమంలో పుష్ప2 లో కూడా మేకర్స్ సమంత తో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సమంతను మేకర్స్ సంప్రదించారని, కానీ ఆమెకు ఇష్టం లేక ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

కానీ అందులో నిజం లేదని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. అసలు మేకర్స్ ఐటెం సాంగ్ గురించి సమంతను అప్రోచ్ అయ్యింది లేదట. సమంత ప్రస్తుతం సిటాడెల్, ఖుషి, శాకుంతలం వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. శాకుంతలం చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ.. కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 14 కి పోస్ట్ పోన్ అయ్యింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus