మరోమారు లవ్ స్టోరీలో నటించనున్న సమంత
- December 30, 2016 / 12:15 PM ISTByFilmy Focus
ఏ మాయ చేశావే.. 2010లో వచ్చిన ఈ చిత్రంతో సమంత అభిమానుల గుండెల్లో తిష్టవేసుకొని కూర్చొంది. ఆ మూవీ తర్వాత బృందావనం, దూకుడు ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది , 24, అ ఆ, జనతా గ్యారేజ్ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ “ఏ మాయ చేశావే..”లో నటనే ది బెస్ట్ నటన గా ఫ్యాన్స్ చెబుతుంటారు. అందుకు కారణం అది పూర్తి లవ్ స్టోరీ మూవీ కావడమే. అటువంటి చిత్రంలో మరో మారు నటించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆమెను ట్విట్టర్లో అడగగా.. ” ఓ.. త్వరలోనే చేస్తాను” అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో స్యామ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మరోసారి మాయ చేస్తుందని సంబరపడుతున్నారు.
సమంతకి ఏ మాయ చేశావే.. కెరీర్ లో మంచి బ్రేక్ ఇవ్వడమే కాదు.. నిజజీవితంలో భాగస్వామిని ఇచ్చింది. అందులో ప్రేమికుడిగా నటించిన యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతోనే ప్రేమలో పడింది. త్వరలో అతనితో తాళికట్టించుకొవడానికి సిద్ధమైంది. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమాలో సమంత నటిస్తుందని చైతూ ఎప్పుడో చేప్పారు. అక్కినేని ఫ్యామిలీ కూడా ఏ అడ్డూ చెప్పలేదు. సో వచ్చే ఏడాది క్యూట్ బ్యూటీ ఓ వైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూనే సినిమాల్లో నటించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














