సమంత, నాగ చైతన్యలు క్యూట్ పెయిర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే చిత్రం సమయంలోనే ఈ జోడి సూపర్ హిట్ అని తెలుగు ప్రజలందరూ ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆశీర్వదించి ఈ ప్రేమ జంటని భార్య భర్తలు చేశారు. కొత్త బాధ్యతలు వచ్చాయని పాత బాధ్యతలను వదిలేయలేదు. ఇద్దరిమధ్య అదే ప్రేమ. ఇద్దరిలో పని పట్ల అదే డెడికేషన్. సమంత యూటర్న్ అనే ద్వి భాషా చిత్రంతో పాటు తమిళంలో రెండు చిత్రాలను చేస్తోంది. నాగ చైతన్య కూడా సవ్యసాచిని కంప్లీట్ చేసి మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేస్తున్నారు. విడివిడిగానే కాదు.. కలిసి కూడా నటిస్తున్నారు.
ఈ సారి సినిమా కోసం కాదు. వాణిజ్య ప్రకటన కోసం. ప్రస్తుతం అదే పని మీద ముంబై లో ఉన్నారు. బిగ్ బజార్ కి ఈ జంట బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోను వీరే ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. అందుకే అక్కడి వారికి నచ్చేలా చైతూ బియర్డ్ స్టైల్ మార్చారు. ఫ్రెంచ్ బియర్డ్ తో స్మార్ట్ గా తయారయ్యారు. సమంత కూడా ఏమి తక్కువ తినలేదు. ఉత్తరాది అమ్మాయి మాదిరిగా చీరకట్టులో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ షూట్ మరో రెండు రోజుల పటు అక్కడే సాగనుంది. అనంతరం హైదరాబాద్ కి వచ్చి తమ సినిమా పనుల్లో బిజీకానున్నారు.