Samantha, Alia Bhatt: ఆ సర్వేలో టాప్ లో నిలిచిన సమంత.. కాజల్, రష్మిక స్థానాలు ఎంతంటే?

  • January 26, 2024 / 03:10 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. ఆరోగ్య సమస్యల వల్ల సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆర్మాక్స్ సర్వేలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిల్మ్ స్టార్స్ లో సమంత టాప్ లోనిలిచారు. ఆల్ ఇండియాలో సమంత నంబర్ వన్ స్థానంలో నిలవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సమంతకు తొలి స్థానం దక్కగా రెండో స్థానంలో అలియా భట్ నిలిచారు. వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న అలియా భట్ రెండో స్థానంలో నిలవడంలో ఆశ్చర్యం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే మూడో స్థానంలో నిలవగా స్టార్ హీరోయిన్ నయనతార నాలుగో స్థానంలో నిలిచారు. భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాజల్ కు ఐదో స్థానం దక్కగా హీరోయిన్ త్రిషకు ఆరో స్థానం దక్కింది. ఏడో స్థానంలో కత్రినా కైఫ్ నిలవగా కియారా అద్వానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. రష్మికకు తొమ్మిదో స్థానం దక్కగా అనుష్క శెట్టికి పదో స్థానం దక్కింది.

టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లకు ఈ జాబితాలో ఛాన్స్ దక్కడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అనుష్క శెట్టి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం లేదు. అయినప్పటికీ అనుష్క తన టాలెంట్ తో ఈ జాబితాలో స్థానం సంపాదించుకుంది.

సమంత రీఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సమంత సినిమాల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది. సమంత నటించాల్సిన కొన్ని ప్రాజెక్ట్ లు ఇతర హీరోయిన్ల చేతికి వెళ్తున్నాయని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో సామ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం సమంత (Samantha) యాక్టివ్ గానే ఉంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus