ఆనందంలో సమంత, నాగచైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి కాకముందు ‘ఏ మాయ చేశావే’ .. ‘ఆటో నగర్ సూర్య’ .. ‘మనం’ చిత్రాల్లో నటించారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో పని చేయనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య .. చందూ మొండేటి దర్శకత్వంలో “సవ్యసాచి” సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక మారుతి దర్శకత్వంలో “శైలజా రెడ్డి అల్లుడు” సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సినిమాని కూడా మొదలెట్టేసారు.

ఈరోజు ఈ చిత్ర షూటింగ్ స్పాట్ కి సమంతతో కలిసి నాగచైతన్య వెళ్తూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికపై పంచుకున్నారు. “ఈ రోజు కచ్చితంగా చాలా కొత్త రోజు .. సమంతతో కలిసి వర్క్ చేయడానికి వెళుతున్నాను” అంటూ సమంతతో కలిసి కార్లో వెళుతోన్న సెల్ఫీని చైతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హరీశ్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి సమంత, నాగచైతన్య ఉమ్మడిగా ఏడుకోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇద్దరి కెరీర్లో ఇదే అత్యధిక పారితోషికం. ఈ సినిమా కథ, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus