Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » యుఆర్ లైఫ్ అతిథి సంపాదకురాలిగా సమంత: ఉపాసన కొణిదెల

యుఆర్ లైఫ్ అతిథి సంపాదకురాలిగా సమంత: ఉపాసన కొణిదెల

  • September 21, 2020 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యుఆర్ లైఫ్ అతిథి సంపాదకురాలిగా సమంత: ఉపాసన కొణిదెల

URLife.co.in వెబ్ సైట్ అతిథి సంపాదకురాలిగా స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్ సమంత అక్కినేని పేరుని ప్రకటించారు యుఆర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, ఉపాసన కామినేని కొణిదెల. URLife.co.in అనే వెబ్ సైట్ ను ఉపాసన కొణిదెల ప్రారంభించారు. టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ, అర్హులైన నిపుణుల నుండి నిర్దుష్టమైన సమాచారాన్నిఅందుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించి, ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో ఉపాసన ఈ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు.

యుఆర్ లైఫ్ బృందంలోని అర్హులైన ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ నిపుణులు, ఇంకా సంపూర్ణమైన పోషక పదార్థాల నిపుణులు, అంతా కలిసి తమ పాఠకులకు ప్రస్తుత కాలానికి తగిన ఆరోగ్య సూత్రాలను, పోషకాల గురించిన వీడియోలను, ఆహార నియమాల ప్రణాళికలను, జీవనశైలి సలహాలను, సూచనలను, ఆరోగ్యాన్ని పెంచే వంటలను, మీకై మీరు ఉత్సాహంగా చేసుకునే వ్యాయామాలను, ఇంకా పాఠకులు ఎల్లప్పుడూ ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు వ్యక్తిగతమైన సేవలను కూడా అందిస్తూ వారికి ఉన్న బడ్జెట్ పరిమితులలోనే ఆరోగ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని, సూచనలను అందిస్తున్నారు.

“URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా – ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక, భావోద్వేగాల సమతుల్యత వంటి నేను గాఢంగా నమ్మే కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే. మా ఈ విలువలను గౌరవించే వారిలో సమంత కూడా ఒకరు. ఆమె కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తున్నారు, పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ, ఆరోగ్యం ఇంకా ఫిట్నెస్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆమె నైపుణ్యం మా పాఠకులకు చేరువ అవుతుందని ఆకాంక్షిస్తున్నాము. శారీరక, మానసిక ఆరోగ్యం గురించి, పోషకాల గురించి, చికిత్స గురించి ఆమె సూచనలు, సలహాలు మా పాఠకులకు అందుతాయని ఆశిస్తున్నాం” అని ఉపాసన పేర్కొన్నారు.

భారతదేశపు కార్పొరేట్ రంగంలో సుమారు కోటి నలభై లక్షల మందికి జీవనశైలి సూచనలు, సలహాలు అందిస్తూ దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థల సౌజన్యంతో URLife.co.in అనే వెబ్ సైట్ నిర్వహించబడుతోంది. నిపుణుల సలహాలు, ఉపయుక్తమైన సమాచారం, పాఠకులు సైతం పాల్గొనే అంశాలు ఇంకా సెలబ్రిటీల ప్రేరణ ఈ వెబ్ సైట్ ద్వారా అందుతున్నాయి. మన దేశంలోనే అతి చిన్న వయస్సులోనే డైనమిక్ ఆరోగ్య సూత్రాల నిపుణురాలిగా ఎదిగిన ఉపాసన కొణిదెల మార్గనిర్దేశకత్వంలో ఈ వెబ్ సైట్ రూపొందింది. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్, యుఆర్ లైఫ్, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ టిపిఎ సంస్థలో విశేషమైన అనుభవం గడించిన ఉపాసన సారథ్యంలో URLife.co.in నిర్వహించబడటం విశేషం.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha Akkineni
  • #Samantha
  • #Samantha Akkineni
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

38 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version