సమంతకు ఉత్తమ నటి అవార్డు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
- July 15, 2017 / 07:06 AM ISTByFilmy Focus
2017 సంవత్సరం సమంతకు ఎప్పటికీ గుర్తిండిపోనుంది. ఈ ఏడాది ఆమెకు వృత్తి పరంగాను, వ్యక్తిగతం పరంగాను అనేక కానుకలను అందించింది. తాను ఎంతగానో ప్రేమించిన నాగ చైతన్యతో నిశ్చితార్ధం ఈ సంవత్సరమే జరిగింది. పెళ్లి కూడా అక్టోబర్ ఆరున జరగనుంది. ఇక ప్రొఫిషన్ విషయానికి వస్తే ఉత్తమనటిగా వివిధ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నప్పటికీ, రాష్ట్రాలు ప్రభుత్వాలు అందించే అవార్డులు ఈ సంవత్సరం అందుకుంది.
2012 లో సమంత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “నీతానే ఎన్ పోనవసంతం\ ఏటో వెళ్లిపోయింది మనసు” చేసింది. ఇందులో ఆమె నటనకు ఆరు అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఉత్తమనటి అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమెకు ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలుపుతోంది. మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














