Samantha: 22 నెలల తర్వాత మళ్లీ ‘వర్క్‌’ మోడ్‌లోకి వచ్చిన సమంత… దేనికోసమంటే?

  • January 31, 2024 / 01:56 PM IST

వరుస సినిమాలు చేస్తూ చేస్తూ మధ్యలో వైవాహిక బంధంలోకి దిగి ఒక్కసారి సినిమాలు స్లో చేసేసింది సమంత. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆ బంధం నుండి బయటకు వచ్చేసింది. అప్పటి నుండి సినిమాల మీద దృష్టి సారించి మళ్లీ జోరు పెంచింది. ప్రత్యేక గీతం, సినిమాలు అంటూ జోరు చూపించడం ప్రారంభించింది. అయితే అనూహ్యంగా అనారోగ్యం బారిన పడటంతో మళ్లీ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. కొద్ది రోజులు నటించి మళ్లీ లాంగ్‌ బ్రేక్‌ తీసుకుంది సామ్‌. ఇప్పుడు తిరిగి మళ్లీ సినిమా పనుల్లోకి వచ్చింది.

సమంత, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించి ‘సిటడెల్‌’ వెబ్‌ సిరీస్‌ గుర్తుందా? విదేశాల్లో ఇప్పటికే వచ్చిన (మనకు కూడా స్ట్రీమ్‌ అయింది అనుకోండి) ‘సిటడెల్’కు ఇండియన్‌ వెర్షన్‌ను రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించగా… అందులో సామ్‌ కీలక పాత్రలో నటించింది. ఈ సిరీస్‌ వస్తుందా? రాదా? అంటూ ఈ మధ్య పుకార్లు కూడా వచ్చాయి. ఎందుకంటే ఎప్పుడు 22 నెలల క్రితం ఈ షూటింగ్‌ పూర్తయిపోయింది అని సమాచారం. దీంతో ఇక రాదు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సిరీస్‌ నుండి అప్‌డేట్‌ వచ్చింది.

22 నెలల తర్వాత మళ్లీ వర్క్‌ మోడ్‌లోకి వచ్చాం అంటూ దర్శకద్వయం రాజ్‌ అండ్‌ డీకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. అందులో సమంత, వరుణ్‌ కూడా ఉన్నారు. అదే సమయంలో డబ్బింగ్‌ పనులు షురూ అయ్యాయి అంటూ సమంత రాజ్‌ – డీకేను ట్యాగ్‌ చేస్తూ ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. దీంతో ఈ సిరీస్‌ పనులు మళ్లీ షురూ అయ్యాయి అని తెలిసింది. ఈ లెక్కన త్వరలో రిలీజ్‌ డేట్‌ వచ్చేస్తుంది అని చెప్పొచ్చు.

‘ఖుషి’ సినిమా ప్రమోషన్ల తరువాత (Samantha) సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. ఆరోగ్యం, వైద్యం, ఫిట్‌నెస్‌ మీద దృష్టి పెట్టడానికే సినిమాల నుండి గ్యాప్ అని ఓ ప్రకటన కూడా రిలీజ్‌ చేసింది. మే బీ ఆ టైమ్‌ పూర్తయిపోయినట్లుంది అందుకే మళ్లీ ‘వర్క్‌’ మోడ్‌లోకి వచ్చింది సామ్‌.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus