కొన్ని డ్రెస్సులు ఉంటాయండీ… కేవలం అందాలను వీక్షకుల ముందు పరచడానికే అన్నట్లుగా ఉంటాయి. ఆ డ్రెస్సులతో దిగి షేర్ చేసే ఫొటోలకు ‘కప్పుకోవడానికి వేసుకున్నారా? చూపించడానికి వేసుకున్నారా’ అనే కామెంట్స్ కూడా కనిపిస్తుంటాయి. ఒకవేళ ఇలాంటి కామెంట్లు మీకు ఎక్కడా చూడకపోయుంటే… సమంత లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్న ఫొటోలు, దాని దిగువ కామెంట్లు చూడండి మీకే అర్థమైపోతుంది. ప్రస్తుతం సినిమాల గ్యాప్ ఇచ్చి… సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది సమంత. అందులో భాగంగా ఇటీవల రూ. ఐదున్నర లక్షల డ్రెస్ వేసుకుంది.
సమంత తన వ్యాపారాలపైన, యాడ్స్ చేయడంపైన ప్రస్తుతం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ క్రమంలో గతంలో చేసిన బ్రాండ్లు, కొత్త బ్రాండ్లకు కొత్త ఫొటో షూట్లు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ ఫొటో షూట్లో వీపు పూర్తిగా కనిపించేలా ఓ డ్రెస్ వేసుకుంది. చూడటానికి యమ బోల్డ్‌గా ఉన్న ఈ డ్రెస్ ఖరీదు వింటే వామ్మో అనకమానరు. ఎందుకంటే పైన చెప్పిన రూ. ఐదున్నర లక్షలు దాని ఖరీదే. అంతెందుకు ఉంటుంది, అంత సీన్ లేదు అని అనుకోవచ్చు.
కానీ ఆ డ్రెస్‌కి ఆన్లైన్లో అంత రేటే చూపిస్తున్నారు. మామూలుగానే (Samantha) సమంత స్టిల్స్ వచ్చాయంటే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది, పోజులు అలాంటివి. ఈసారి బికినీలు, బ్యాక్‌లెస్ డ్రెస్‌లు వేసి మరీ పోజులచ్చింది. ఓ మ్యాగజైన్ ఇచ్చిన ఫొటోషూట్లోనివి ఆ ఫొటోలు. అలా ఆ షూట్లో లూయీస్ వూటాన్కి చెందిన ఓ డ్రెస్ వేసుకుంది. అందులో వీపు మాత్రమే కనిపించేలా ఫొటో దిగినా…
ఫ్రంట్ వ్యూ కూడా భలేగా ఉంటుంది అని ఆ డ్రెస్ ఆన్లైన్ పిక్స్ చూస్తే చెప్పేయొచ్చు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి శారీరకంగా ఫిట్‌గా మారేందుకు సమంత ఈ గ్యాప్ తీసుకుంది. ఇప్పుడున్న ఫిట్‌నెస్‌కే ఇంత హాట్‌గా ఉంటే… పూర్తి ఫిట్‌గా ఉంటే ఇంకెంత హాట్‌గా మారుతుందో అనే కామెంట్స్ కూడా ఆమె పోస్ట్ కింద కనిపిస్తున్నాయి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!