భర్త తో కలిసి బర్త్ డే వేడుక జరుపుకున్న సమంత.!

సమంత ఇప్పటివరకు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి అనేకసార్లు పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. తొలిసారి తన భర్త నాగచైతన్యతో కలిసి ఈ వేడుకను చేసుకున్నారు. నేడు పుట్టినరోజు సందర్భంగా నిన్ననే హిమాలయ ప్రాంతానికి వీరు చేరుకున్నారు. అక్కడ ఓ విలాసవంతమైన కాటేజ్ లో రాత్రి బర్త్ డే సెలబ్రేషన్ సందడిగా జరుపుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “స్వర్గంలో అడుగుపెట్టా” అంటూ హోటల్‌ గది నుంచి తీసిన ఫొటోను పంచుకున్నారు. వీటితో పాటు ముందే జరుపుకున్న బర్త్ డే ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న “యూ టర్న్‌” చిత్ర బృందం ముందే ఆమెతో కేక్‌ కట్‌ చేయించారు.

మరి కొందరు సామ్‌ స్నేహితులు కూడా ఆమె బర్త్‌డే పార్టీని నిర్వహించారు. వేడుకలు ముందుగానే ప్రారంభమయ్యాయి అంటూ ఈ ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత “యూ టర్న్” సినిమాతో పాటు డైరక్టర్ త్యాగరాజన్‌ దర్శకత్వంలో “సూపర్‌ డీలక్స్‌”, అలాగే శివ కార్తికేయన్ తో సీమ రాజా అనే మూవీ చేస్తున్నారు. వీటికంటే ముందు సమంత నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. అవి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి. రెండోది “ఇరుంబు తిరై(అభిమన్యుడు)”. మహానటి మే 9 న రిలీజ్ కానుంది. ఇక విశాల్ హీరోగా తెరకెక్కిన అభిమన్యుడు మే 11 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus