Samantha: హైదరాబాదులో కాకుండా ఆ ప్రాంతంలో కోట్లు విలువచేసే ఇల్లు కొన్న సమంత?

  • February 7, 2023 / 07:48 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత గత కొద్దిరోజులుగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత చికిత్స తీసుకుంటూ పూర్తిగా తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.అయితే ఈమె నటించిన యశోద సినిమా ఇటీవల కాలంలో విడుదలై ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం.

ఈనెల 17వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇకపోతే మాయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి సమంత తిరిగి తన సినిమా షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. మయోసైటిసిస్ వ్యాధి కారణంగా సినిమాలకు కూడా దూరంగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాకు కూడా దూరమయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈమె ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సమంత తాజాగా ఒక ఫోటో షేర్ చేయడంతో సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేశారని అందరూ భావిస్తున్నారు. ఇంటి బాల్కనీలో సముద్రపు వ్యూ కనిపించేలా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అయితే ఈమె హైదరాబాద్లో కాకుండా తన సొంత రాష్ట్రమైన చెన్నైలో కాకుండా ఏకంగా ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

మూడు పడకల గదులు కలిగినటువంటి ఈ విలాసవంతమైన భవనం కోసం సమంత సుమారు 15 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.ఇలా సమంత కొత్త ఇంటిని కొనుగోలు చేశారనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus